Monday, 25 December 2017

Saturday

29-12-2017
వెన్న దొంగవైన నీ దరి వేదములు అపహరించే మత్స్య రూపం ధరించి కాపాడినావే!
ఓటమిని ఓడించి పాల సముద్రం చిలికే కూర్మ రూపం దాల్చి మధనము గావించినావే!
మురికిని దులిపేసి వరాహ రూపంలో పై కెగిసి భూమిని ఉన్నత స్థాయిలో నిలబెట్టినావే!
ఎందు కలడని అంటే నారసింహుడై కడుపుని చీల్చి పాపములను ప్రక్షాళన చేసినావే!
బుడి బుడి అడుగులతో వామనుడై నడిచి రెండు అడుగులే భూమి ఆకాశం నింపి చెడుని పాతాళానికి తొక్కినావే!
పరమశివుడై పరశు రాముడై శత్రువులని గండ్ర గొడ్డలితో కడతేర్చినావే!
ఏ మహిమలు మర్మము లేకుండా మానవుడై రాముడివై రావణ అసురులను సంహారించినావే!
ఏ ఆయుధము పట్టక కృష్ణుడివై నికృష్టుల భారతం పట్టినావే!
నిస్సారమయ్యే యుద్ధములను ఆపి సిద్దార్థుడివై గౌతమ బుద్ధం సంఘం శరణం గచ్ఛామి అన్నావే!
కలియుగం అంతమయ్యేలా కల్కి అవతారమెత్తి లోక సంరక్షణార్తం ఎప్పుడు వస్తావయ్యా!
         వేం*కుభే*రాణి

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక చిన్న సమర్పణ!

[11/16, 22:48] Venkatesh K E: చిన్ని కృష్ణా
వెన్న దొంగ
కనపడకుంటే
యశోదమ్మకు బెంగ!

అమ్మ కృష్ణా
చీరల దొంగ
ఇవ్వకుంటే
గోపికలకు బెంగ!

ముద్దుల కృష్ణా
పారిజాతాల దొంగ
ఇచ్చావంటే
సత్యభామకు బెంగ!

అల్లరి కృష్ణా
శమంతకమణి దొంగ
దొచకుంటే
జాంబవతి కు బెంగ!

        వేం*కుభే*రాణి

Happy Saturday n weekend.
11-11-2017
[11/17, 09:51] Venkatesh K E: శ్వేత వర్ణ మేఘాలే ఛత్ర ఛామారాలై రాగా!
నల్లమల అడవులే పచ్చని తోరణాలై రాగా!
అప్సరసలే బ్రహ్మోత్సవాల్లో నాట్యము ఆడగ రాగా!
గాన గంధర్వులే నీ సన్నిధిలో పాడగా రాగా!

        వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.

Clouds on Tirumala hills became Umbrella for you.
Greenary in Nallamala forest became _toranam_ for you.
Apsaras come to _Mada veedhi_ n dance at Brahmotsavam.
Gandharva singers sing in praise of you.
Oh! Lord, bless us.
04-11-2017
[11/17, 09:54] Venkatesh K E: పుష్ప వీక్షణం మనసు ఉల్లాసం!
శ్రవణ నక్షత్రం పుష్ప యాగం!
ఏకవింశతి పుష్పం సప్తదళ సుగంధం!
షట్కాల పూజ పుష్పం ప్రధానం!

గులాబీ చేమంతం బొందుమల్లి శిఖామణి!
కిరీట ధారణం ఫూలమాల భుజం!
కంఠసరి కుడిఎడమల భుజాల అలంకారం!
సాలగ్రామమాల పరిమళ పుష్పాల అల్లకం!

కఠారి సరం నడుము నందకం!
మూడు మాలల తావళం చరణం!
శ్రీనివాస సర్వ పుష్పమాల ధారణం!
వర్ణించడం కష్టం ఆస్వాదించడం ఉత్తమం!

ఈ రోజు తిరుమలలో శ్రీనివాసునికి పుష్ప యాగం.

Happy Saturday n weekend.

Venkatesh K E:
On Sravana nakshatram after Brahmotsavam, a floral tribute, Pushpa yagam performed at Tirumala to Lord Malayappa Swamy.

Flowers grow n blossom without any noise. One's heart glows when we see flowers.

Daily 6 times pooja done at Tirumala. In every pooja, flowers have prime place. *_Shatkala pooja_* with 21 types of flowers and seven types of scented leaves like dhavanam etc.

Garlands for Lord Balaji have different names; Shikamani Garland consists of Roses, Bondu jasmine and chemanthi, worn over kiritam and shoulders.
Kantasari, garland from neck and either shoulders. Salagrama garland made of scented flowers. Special garlands for Shanku n Chakram also.

Katari saram is a garland worn around waist, Nandakam is in it. Tavalam consists of 3 garlands.
28-10-2017
[11/17, 09:55] Venkatesh K E: Venkatesh K E:

ఒక్కటే ఒక్కటే
భగవంతుడు ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
ఆత్మ పరమాత్మ ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
బ్రహ్మావిష్ణుమహేశ్వరులు ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
సామా యజు ఆధర్వణ ఋగ్వేదములు ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
పంచేంద్రియాల శరీరం ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
షడ్రుచుల వంటకం ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
సప్త స్వరాల పాట ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
అష్ఠ దిక్కుల ప్రపంచం ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
నవ రసాల జీవితం ఒక్కటే!
ఒక్కటే ఒక్కటే
దశావతార విష్ణువు ఒక్కటే!
        వేం*కుభే*రాణి

Happy Saturday n weekend.
21-10-2017
[11/17, 09:57] Venkatesh K E: Venkatesh K E:

సుఖాలు దొరుకునా కష్టాలు పడకుండా!
విజయాలు దొరుకునా ప్రయత్నాలు లేకుండా!
ఫలించునా తలపు మనసు దాటకుండా!

కంటికి కనపడునా మసక బారిన!
దైవము ప్రత్యక్షమవునా కల్మషం చాటున!
మోక్షము కలుగునా మనసు కడగనా!

జ్ఞానము సార్ధకత తెలియును, నలుగురికి ఉపయోగపడినప్పుడు గదా!
కర్మలు ఫలియుంచుట,  ఎనలేని శ్రీవేంకటేశ్వరుని దరి చేరినప్పుడు గదా!
తన జన్మ పరిపూర్ణమవుట తెలియును,  ఆత్మ శాంతత కలిగినప్పుడు గదా!

This is something like Management subject. Inspired by Annamayya sankeerthana n written.
Without trying, anything will not come. If you want to achieve more, you should put more efforts. Everyone wants luxuries and happiness.

Happiness are 2 types. Materialistic happiness n luxuries are temporary and _*MOKSHA*_ is permanent and ultimate happiness n luxury. You can see in Annamayya song.

Happy Saturday n weekend.
14-10-2017
[11/17, 09:58] Venkatesh K E: సప్త గిరి వాసా! ఓ శ్రీనివాసా!

నా మనసైనావా తిరుమల దేవా!

నన్ను మురిపించీ సర్వస్వం అయినావా!

నా హృదయ స్పందన విని రావా!

కష్టాల కడలి లో కాపాడు నావ!

కృష్ణ! నీకై చేసా వెన్న పాల కోవా!

ఐశ్వర్యములే వరమై అందించవా!

              వేం*కుభే*రాణి

Shrine of seven hills, Oh Lord Srinivasa.
Oh Lord of Tirumala, you have filled in my heart.
You are omnipresent to me you are total.
Come to me, listen to my heart beat.
You are a BOAT to cross ocean of difficulties.
Made butter, sweets and lot more to you, oh! Krishna.
Give *_Ishwaryams_* as boon.


Happy Saturday n weekend.
07-10-2017
[11/17, 10:00] Venkatesh K E: ఓ ఆపధ్భాందవ,

వేల వేల కనులున్న చాలవు నీ బ్రహ్మోత్సవములు వీక్షింపగ!

వేల వేల చెవులున్న చాలవు అన్నమయ్య కీర్తనలు వినగ!

వేల వేల చేతులున్న చాలవు ఆళ్వారుల సేవను మించగ!

వేల వేల నోరులున్న చాలవు నీ దివ్య గానము చేయగ!

Happy Saturday n weekend.

To see Brahmotsavam, one should have 1000 eyes, even then it's not enough.
Even thousands of ears not enough to listen Annamayya songs on Lord Balaji.
You cannot cross Alwars in seva, even though one had 1000 hands.
To give chorus while singing divine songs it's not enough even one has thousand mouths.
30-09-2017
[11/17, 10:11] Venkatesh K E: Wishes on Brahmotsavam, Dasara n Saturday.

Creator's Utsavam with
Infinite Creativeness.

ధ్వజారోహణ ప్రారంభం దేవతలకు శుభ ఆహ్వానం!
శ్రీ పేరూరు శివ ప్రసాద్ ధ్వజ పటం పసుపు వర్ణం!
సహజ రంగుల గరుడాళ్వారు ధ్వజం హరి వాహనం!
సర్వ దేవతా దర్శనం ఈ బ్రహ్మోత్సవ ధ్వజం!
 Venkatesh K E:

Flag hoisting at Tirumala during Brahmotsavam is just not a flag, it's *DVAJA PATAM*
Since 3 decades from 1986, it's done by Sri Peruru Siva Prasad.
Cloth is soaked for a day or so in turmeric n dried to get yellow color.
To retain yellow color, Dvaja is soaked in _nimma uppu_  for a day.
On this Garudalvar is drawn using natural colors only.
Dvaja is termed as vehicle of Venkateswara.
Dvajarohanam means starting of Brahmotsavam and by this all Gods come to Tirumala to grace Brahmotsavam.

            వేం*కుభే*రాణి
[11/18, 07:22] Venkatesh K E: హరివై చేత చక్రంబు బూని
మము రక్షింపగ వచ్చితివని
నిజమని నమ్మితిని

మోహినివై అమృతం కాపాడి
మము కాపాడగ వచ్చితివని
నిజమని నమ్మితిని

కృష్ణుడివై పిల్లనగ్రోవి వాయించి
మము ఆశీర్వదింపగ వచ్చితివని
నిజమని నమ్మితిని

Happy Saturday n weekend.
18-11-2017
[11/18, 10:46] Venkatesh K E: Happy Saturday n weekend.

ఏ పేరున కొలవాలి స్వామి,  నీకు ఎన్నెన్నో నామాలు కదా స్వామి!

ఏ సేవను చేయాలి స్వామి, నీకు ఎన్నెన్నో ఉత్సవాలు కదా స్వామి!

ఏ ప్రసాదమును తేవాలి స్వామి,  నీకు ఎన్నెన్నో ఆరగింపులు కదా స్వామి!

ఏ మొక్కును మొక్కాలి స్వామి, నీకు ఎన్నెన్నో మొక్కుబడిలు కదా స్వామి!

            వేం*కుభే*రాణి
 Venkatesh K E
Lord Venkateswa has thousands of names to his credit.
Lord has many sevas from morning Suprabatha seva, Thomala seva to night Muthyala harati and many utsavas through out the year (Bramhotsavam).
Lord daily offerings are many from Pulihora, daddojanam, laddu, vada, sweets and many.
Bhaktas offer in very different ways, like Tala neelalu, Adugu adugu dandalu, money, gold and many.

May be this proverb had come after seeing, "జిహ్వ కొ రుచి,  పుర్రె కొ బుద్ధి". According to individual taste, prasadams are offered to Lord Balaji. According to their own thoughts, " Mokku" offered in their own way.
16-09-2017
[11/18, 10:48] Venkatesh K E: Happy Saturday n weekend.

అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వరుడే అన్ని సమస్యలకు పరిష్కారం (మందు) గా గొచరిస్తాడు.

మీరే చూడండి ఈ సంకీర్తనలో

కొనరో కొనరో మీరు కూరిమిమందు
ఉనికి మనకి కెల్ల నొక్కటే మందు

ధ్రువుడు గొనినమందు తొల్లియు( బ్రహ్లాదుడు
చవిగా( గొనిన మందు చల్లని మందు
భవరోగములు వీడి పార(గ( బెద్దలు మున్ను
జవకట్టికొనిన నిచ్చలమైన మందు

నిలిచి నారదు(డు గొనినమందు జనకు(డు
గెలుపుతో( గొని బ్రతికిన యా మందు
మొలచి నాలుగుయుగముల రాజులు ఘనులు
కలకాలముగొని కడగన్న మందు

అజునకు( బరమాయువై యెసగిన మందు
నిజమై లోకములెల్ల నిండిన మందు
త్రిజగములు నెఱు(గ తిరువేంకటాద్రిపై
ధ్వజమెత్తె( గోనేటి దరినున్న మందు

Annamayya found solutions for all problems n rogas.

Get solutions from Brahma swarupa Venkateswara for all your problems, only one medicine.

For those who drown in Samsaram and for one who is far away from it, Vishnu gives moksha.

Since four yugas glory given to kings, this medicine God's divinity.

For all worlds, to be happy is only medicine is sharanam of Prema swarupa, Balaji.
09-09-2017
[11/18, 10:54] Venkatesh K E: పాల కడలి. తాగనారంభించే బాల గణపయ్య!
మహా విష్ణువు చక్రం మింగే చక్లం అనుకొని బాల గణపయ్య!
తుదకు గుంజిళ్లు తీసే నవ్వించి చక్రాన్ని బయటకు వచ్చెనయ్య!
గుంజిళ్లతో చక్రమే కాదు జ్ఞానమూ బయటకు వచ్చునయ్య!
         వేం*కుభే*రాణి
02-09-2017
[11/18, 10:59] Venkatesh K E: సుఖ వర దాయక
దు:ఖ నాశ వినాయక
ఈశ్వర ప్రియ వరద
విష్ణు ప్రియ వినాయక
             వేం*కుభే*రాణి
26-08-2017
[11/18, 11:02] Venkatesh K E: తిలలా నిగ నిగ లాడే గోవులు శ్రేష్ఠం; కొత్త ఇంట్లోకి ఆవు దూడతో గృహ ప్రవేశం

*అ*మ్మ తరువాత *ఆ*వే, కాని *ఇ*ల్లు             *ఈ*శ్వరుడు కంటే ముందే

సంపద అంటే గో గణమే,  కౌరవులు విరాట రాజు గోవులనే ఎత్తు కెళ్తారు

శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరి నెత్తి ఆవులను కాపాడుతాడు.

Cow is auspicious living being in World. Earlier richness is measured by no of cows one have.
Even Kauravas steal cows from king Virata.
Lord Krishna lifted Govardhana mountain n protected cows.
Cow milk, butter, even cow dung n urine has antibiotic and medicinal values.
We may not be able to keep cows near/in house.
Let's donate to GOSHALAS and feed cows indirectly.

Happy Saturday n weekend.
12-08-2017
[11/19, 07:32] Venkatesh K E: ఓ శ్రీనివాస నను మన్నించుమా
జ్వరముతో నే వణికి పోతున్నా
దగ్గు దగ్గులతో నే రాయ లేకపొతున్నా
నీపై ప్రియమైన ఓ పద్య మాలిక

Happy Saturday n weekend.
29-07-2017
[11/19, 07:37] Venkatesh K E: Happy Saturday and week ahead.

శ్రీ హరి భక్తులతో మాటలు అమోఘమైన పుణ్యపు మూటలు!
శ్రీ విష్ణు భక్తుల సహవాసమే సర్వదా ముక్తి కాంతా ప్రసాదము!
భక్తి మార్గమే కామక్రోధ అరిషడ్వర్గాలు ప్రవేశించని దుర్గాలు!
ధర్మరాజే చెప్పె భాగవతుల జోలికి పోజాలదు దూతలార!

Conversation with Hari bhaktas itself ' *punyapu* ' treasure.
Spending time with them itself ' *mukthi* '.
The way, bhakti, on its own is no entry for ' *arishadvargamulu* '.
Even Dharmaraja told to his ' *dhutas* ' not to touch Bhagavatas.
15-07-2017
[11/19, 15:47] Venkatesh K E: వేద పదార్థజాత బ్రహ్మవిద్యా యోగినేత  భగవంతుని లీల
నారద మహర్షి తెలియ చెప్పె వ్యాస ముని రాసేలా
సంస్కృత భాగవతాన్ని జన్మ సఫలంబు అయ్యేలా
పొతన తెలుగులో రచించే పునర్జన్మ సాఫల్యమయ్యేలా!!

             వేం*కుభే*రాణి

Happy Saturday and weekend.
08-07-2017
[11/19, 16:01] Venkatesh K E: మధుర భాషణం:

      దినాన్తే చ పిబేత్ దుగ్ధం
      నిశాన్తే చ పయః పిబేత్!
      భోజనాన్తే పిబేత్ తక్రం
      కిం వైద్యస్య ప్రయోజనం

ఆధునిక వైద్యం వ్యాధుల్ని ఎలా నయం చేసుకోవాలో తెలిపితే ప్రాచీన ఆయుర్వేదం వ్యాధులు రాకుండా ఎలా‌ జాగ్రత్త‌తీసుకోవాలో కూడా చెప్పింది.
 సాయంకాలంలో పాలుతాగేవారికీ
 ప్రాతఃకాలంలో నీరు తాగేవారికీ
ఏ సమయంలోనై‌నా
భోజనాంతరం మజ్జిగ తాగే వారికీ
వైద్యునితో అవసరం ఏముంటుంది..?
అని దీని భావం.
ఆధునిక వైద్యులూ దీనిని బలపరుస్తున్నారు మరి.

సర్వేజనాః సుఖినోభవంతు.
01-07-2017
[11/19, 16:04] Venkatesh K E: కృత యుగమున మానసికార్చన!
త్రేతాయుగమున కాయికార్చన!
ద్వాపర యుగమున విగ్రహా అర్చన!
కలియుగమున నామ స్మరణే అర్చన!

In Kruta yuga, one has to do penance to get Moksha.
In Tretayuga, one has to do Homa, Japas, etc., to get Moksha.
In Dwapara yuga it's enough to do poojas (Temple), vratas to get Moksha.
In Kali yuga it's just enough to do (nama chintana) spell name of the God to get Moksha.

Happy Saturday and weekend.
24-06-2017
[11/20, 10:14] Venkatesh K E: పగలంతా లక్షలాది ప్రజల గొంతెమ్మ కోర్కెల నుండి మైమరచి హాయిగా!

వెంగమాంబ ముత్యాల హరతుల పరిమళంలొ హాయిగా నిదురపో!

సుప్రభాతం నుండి లడ్డూ వడ దద్దొజనం పాయసాల రుచులను మైమరపించే!

అన్నమయ్య వారి కవితల లాలి లొ జో అచ్యుతానందా జో అచ్యుతా!

వెంగమాంబ మాతాళులపాక అన్నమయ్య వారి పవళింపు సేవలో స్వామి వారు అన్ని మరచి మైమరచి హాయిగా నిదురపోతున్నారా!
          వేం*కుభే*రాణి
Happy Saturday and weekend.
03-06-2017
[11/20, 10:18] Venkatesh K E: Happy Saturday and weekend.

తెర తీయగా రాదా లోని
తిరుపతి వెంకటరమణ! మచ్చరమను

పరమపురుష! ధర్మాదిమోక్షముల
పారఁదోలుచున్నది నాలోని

ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులు రీతి యున్నది
హరిధ్యానము సేయు వేళ చిత్తము
అంత్యజు వాడకుఁ బోయిన ట్లున్నది

మత్స్యము ఆకలిఁగొని గాలముచే
మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధి మరు
గిడఁ బడి చెఱచిన ట్లున్నది

వాగురయని తెలియక మృగగణములు
వచ్చి తగులు రీతి యున్నది
వేగమే నీ మతము ననుసరించిన
త్యాగరాజనుత మదమత్సర మను
             *త్యాగయ్య*

For more details see my blog.
srimadbhagavatam: *త్యాగయ్య*http://mybhagavatam.blogspot.com/2017/05/blog-post.html?spref=tw
26-05-2017
[11/20, 10:21] Venkatesh K E: వైశాఖ మాసం అంటే అందరికీ ఇష్టం.  తియ్యని మామిడి,  సెలవుల వేడి, జాతరల సందడి ఇలా ఎన్నెన్నో.

శ్రీ మహ విష్ణువుకు అమిత ప్రీతి పాత్రమైన మాసం.

క్షీర సాగర మదనంలో కూర్మావతార మూర్తియై అనుగ్రహించిందీ మాసంలో.

భక్త ప్రహ్లాద వరదుడైన నారసింహుడు అవతరించిన వైశాఖ మాసం.

రామ రాజ్యం కంటే గొప్ప భక్తి సామ్రాజ్యానికి తొలి ఆచార్యుడు ఆంజనేయుడు పుట్టినదీ మాసంలో.

వెయ్యి వసంతాలైన మరిచిపొని భగవద్రామనుజులు పుణ్యం ఈ మాసంలో.

వెంకన్న భక్తుడు పద కవిత పితామహుడు ఆచార్య అన్నమయ్య జననం ఈ మాసంలో.

భక్తురాలు,  రచయిత్రి ఆయిన తరిగొండ వేంగమాంబ సేవానిరతి మాతృశ్రీ వెలసిందీ మాసంలో.

రెండున్నర దశాబ్దాల క్రితమే తెర తీయగా రాదా అని కీర్తించిన త్యాగరాజ స్వామి,  ఈ మాసంలో.
              వేం*కుభే*రాణి
Happy Saturday and weekend.
20-05-2017
[11/20, 10:23] Venkatesh K E: వేదోద్థారకా మత్స్యావతారా వేదనారాయణ!
నాగులాపుర క్షేత్ర: సోమకాసుర వధ, నారాయణ !
హరిగొండపుర స్వయంభువు వేద పరి రక్షణ!
శ్రీ కృష్ణ దేవరాయ సప్త ప్రాకారా నవ నిర్మాణా !
           వేం*కుభే*రాణి

Happy Saturday and weekend.
The temple built by Sri Krishna Devaraya in Nagulapura. It's 35 km from Puttur and 75 km from Tirupati. Matsavatara and protected Vedas. So here God is known as Veda Narayana.

For further details see my blog:

srimadbhagavatam: Vedanarayanahttp://mybhagavatam.blogspot.com/2017/05/vedanarayana.html?spref=tw
13-05-2017
[11/20, 10:28] Venkatesh K E: శ్రీ కృష్ణ

నీ కొరకు జప తపాదులు చేసినను దొరకదు దర్శనం.

ఒక్కటంటే ఒక్కటే తులసి దళం చాలునా

పిడికెడంటే పిడికెడే అటుకులు చాలునా

గోవర్ధనగిరి మోయనా చిటికెన వేలు చాలునా

పూతనను చంపనా ఉగ్గు పాలు చాలునా
               వేం*కుభే*రాణి
Happy Saturday n happy weekend.
05-05-2017
[11/20, 10:33] Venkatesh K E: శివుని విల్లు నెత్తగలిగిన ఓ రామా
సీతమ్మ జడ పైకెత్తగలవా శ్రీ రామా!

ఆహా పవిత్రమాయే పాదము సొకగానే అహల్య
మరి తనువే తాకిన జానకి కాలేనా హోత్రమై!

చేయి తాకగానే పండేను గొరింటా అరచేత
వైకుంఠమున నుండెడి నిండు గర్భిణిని నట అడవిలో!

ఇదంతా ధర్మము కొరకేనని అర్థమయ్యేనా ఈ  మానవులకు.
           వేం*కుభే*రాణి
Happy Saturday n happy weekend.
29-04-2017
[11/20, 10:35] Venkatesh K E: ఎల్ల జనుల పాపములు మాసిన కొండ
ప్రకృతి నిత్యము పచ్చ తోరణపు కొండ
గోవింద హరి నామాలతొ మ్రోగిన కొండ
వేంకటేశ్వరుడుండేటి ఈ తిరుమల కొండ

                 వేం*కుభే*రాణి

Happy Saturday n
Happy weekend.
21-04-2017
[11/20, 10:38] Venkatesh K E: వేదములే శిలలై వెలసినది కొండ
యేదెసఁ బుణ్యరాసులే యేఱులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ
శ్రీదేవుఁ డుండేటి శేషాద్రి యీ కొండ

Happy Saturday n happy weekend.
14-04-2017
[11/20, 10:39] Venkatesh K E: ఓ శ్రీనివాస

సర్వత్రా వెలుగును ప్రసరించే నీకు !
వెలుగులోకి వెలుగేలా, ఈ హారతులేల !

ఒక్క క్షణం దర్శనం చేతనే ఏడు జన్మల పాపములు హరింతువో!
పాప హరుడికి కోనేటి స్నానాలేల, అభిషేకాలేల!

ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి !
తెప్ప తిరుణాళ్ళేల, బ్రహ్మోత్సవాల్లేల!

మన ఆజ్ఞానాన్ని తొలగించాడానికే ఈ హారతులు!
మనలను ప్రక్షాళన గావించడానికే ఈ స్నానాలు !
మనందరిని ప్రఖ్యాతి గాంచడానికే ఈ ఉత్సవాలు!
Happy Saturday n happy weekend.
                  వేం*కుభే *రాణి
08-04-2017
[11/20, 16:15] Venkatesh K E: సర్వ పాప హరుడైన నీకు ధనం వనం,
ఇరు భామలను జోడించారు జనం.

మా మాత పద్మావతమ్మ న్యాయం కోరితే,
కొంతైన పశ్చాత్తాపం లేదే తిరుచానురుకు వెళితే.

తండ్రి శ్రీ వేంకటేశ్వరా ఇది కలియుగ ప్రభావమా ?
మీకూ తప్ప లేదా స్వామి నిష్కలంకా ?

కడకు అమ్మ పద్మావతమ్మకు
అన్నమయ్య కూడా అన్యాయం చేశారా.

లేక జనుల సౌలభ్యం కోసం అమ్మని
మరిచారా అమ్మ కీర్తనలును మరిచారా.

శ్రీదేవి భూదేవి లకు వైభవంగా
నిత్య కళ్యాణం జరిపిస్తున్నారే.

మరి మా అమ్మ పద్మావతమ్మకు
పత్యముగా ఏడాదికొ మారు పెళ్లి జరిపిస్తున్నారే.
Happy Saturday n happy weekend.
01-04-2017
[11/23, 08:06] Venkatesh K E: వైకుంఠాన అలిగె భృగు మహర్షి చెప్పె అందరి దేవుడని
భూలోక వైకుంఠాన సహస్ర దళ బంగారు పద్మంలో అనుగ్రహించి

అలిగిన అలమేలు పతికి అలసట
అలిపిరి పాదుకలు అరిగి  పద్మావతి

తిరుచానూరు వేరు కాదు మంగమ్మ
కరివేపాకు తిరు నాధుడు ఎక్కడమ్మ

సువర్ణ పద్మము నుండి ఆవిర్భావం
బంగారు మంత్ర పుష్పం ఈ పుష్ప యాగం
Today 23-11-2017 is last day of Tiruchanur Padmavati amma vari Brahmotsavam.
[11/24, 10:07] Venkatesh K E: దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా
తథా దేహాన్తర ప్రాప్తి ర్ధీర స్తత్ర న ముహ్యతి
Chapter 2, 13th sloka

When one grows from child to adolescent and to youth, everybody will be happy, then why one should fear for old age and death. It's something like leaving old shirt and wearing new shirt.

Just like ripened fruit leaves Mother tree, we should pray God to give this type of Moksha.
7 days to Gita Jayanti 30-11-2017
[11/25, 06:56] Venkatesh K E: క్రోధాద్భవతి సమ్మోహాః సమ్మోహాత్స్మృతి విభ్రమః
స్మృతి భ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రశ్యతి
Chapter 2, 63rd sloka.

Anger is like a cool breeze initially, turns into wind and turns finally into whirlwind and drowns you.

In anger one will loose senses and do not know what is doing and looses friends.

6 days to Gita Jayanti 30-11-2017
[11/26, 07:23] Venkatesh K E: యేహి సంస్పర్శజౌ భోగా దుఃఖయోనయ ఏవతే
ఆద్యన్తవన్తః కౌన్తేయ నతేషు రమతే బుధః
Chapter 5, 22nd sloka.

Bhoga bhava Maha roga. One should not be attracted towards Bhoga and lead to dukham.

5 days to Gita Jayanti 30-11-2017
[11/27, 07:49] Venkatesh K E: శక్నోతిహైవ యస్సోధుం ప్రాక్ఛరీరవిమోక్షణాత్
కామక్రోధోద్భవం వేగం స యుక్తస్స సుఖీ నరః
Chapter 5, 23rd sloka

One should over come all ups n downs of life and _krodha & kama_ while living with this body is the real *YOGI* and is happiest man.

4 days to go Gita Jayanti 30-11-2017
[11/28, 06:38] Venkatesh K E: “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ”

మనుస్మృతి

ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.

As today 28-11-2017 is GES at Hyderabad and theme is Women enterprenuers

మృత్యుస్సర్వహరశ్చాహ ముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిశ్శ్రీర్వాక్చ నారీణాం స్మ్రతిర్మేధా ధృతిః క్షమా||
Bhagavad Gita 10th chapter, Vibhuthi yogam 34th sloka.

శ్రీ కృష్ణుడు అర్జునుడితో ఇట్లు అనెను.
సర్వ భక్షకులలో మృత్యువును నేను. తరువాత ఉత్పత్తి కారణమైన పుట్టుకను నేను.
స్త్రీల యందు ఉన్న కీర్తి, మంగళము, తీయని పలుకు, స్మృతి జ్ఞానము, ధారణ బుద్ధి, ధైర్యము, ఓర్పు అను ఏడు సద్గుణములు నేనే అయి ఉన్నాను.

In Vibhuthi yoga, while Sri Krishna telling about all the wordly matter I am there.
He says to Arjuna in the death and birth I'm there.
I am the best 7 qualities of Women; _Keerthi,_
_Mangalam,_
_Sweet voice,_
_Knowledge,_
_Immunity,_
_Courage,_
_Patience_
       
3 days to Gita Jayanti 30-11-2017
[11/29, 05:51] Venkatesh K E: వేదానాం సామవేదోస్మి
దేవానామస్మి వాసవః
ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా
Chapter 10, 22nd sloka

In Vibhuthi yoga, Sri Krishna tells Arjuna that I am Sama veda in Vedas, I am Vishnu, I am _manassu_ in Indriyas, I am active part in avasthas.

2 days to Gita Jayanti 30-11-2017
[11/30, 07:11] Venkatesh K E: శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్
జ్ఞానాద్ధ్యానం విశిష్యతే
ధ్యానాత్కర్మఫలత్యాగః
త్యాగాచ్ఛాంతి రనంతరమ్
Chapter 12, 12th sloka

In Bhakti yoga it has been described in length about Bhakti and how to attain it.
Knowledge is superior to practice. _Dhyanam_ is better than Knowledge. _Karma phala tyagam_ is far superior than dhyanam. Finally the tyagam gives you *PEACE*
Today is Gita Jayanti 30-11-2017

For more details on Bhagavad Gita see my Blog

Bhagavd Gita: Bhagavad Geeta

http://mybhagavadgeeta.blogspot.com/2015/01/bhagavad-geeta.html?spref=tw
[12/2, 08:24] Venkatesh K E: హరివై చేత చక్రంబు బూని
మము రక్షింపగ వచ్చితివని
నిజమని నమ్మితిని

మోహినివై అమృతం కాపాడి
మము కాపాడగ వచ్చితివని
నిజమని నమ్మితిని

కృష్ణుడివై పిల్లనగ్రోవి వాయించి
మము ఆశీర్వదింపగ వచ్చితివని
నిజమని నమ్మితిని

Happy Saturday n weekend.
02-12-2017
[12/8, 22:17] Venkatesh K E: *ఆణివర ఆస్థానం*

మలయప్ప స్వామి బంగరు సింహాసనం పై ఆలకించి
ఈనాటి వార తిథి నక్షత్ర ఉత్సవ విశేషాలు
నిన్నటి ఆదాయం బంగారు వెండి నగలు పాత్రల లెక్కలు
ముందు నాడు దర్శనం చేసుకొన్న భక్తుల సంఖ్యలు

Earlier daily budget is presented to Lord.
Not only for Lord Malayappa, but for everyone these three are important.
1. Today's works and visheshas.
2. Yesterday's income (how much to spend n save)
3. How many well wishers are still there with us.

Today 16-07-2017 is *ఆణివర ఆస్థానం* .
[12/8, 23:01] Venkatesh K E: ఆనందాల కేమరుదు

చూడరమ్మ సతులాల సోబాన( బాడరమ్మ
కూడున్నది పతి( జూడికుడుతనాచారి,

శ్రీ మహాలక్ష్మియట సింగారాల కేమరుదు
కాముని తల్లియట చక్క(దనాల కేమరుదు
కోమలాంగి యీ చూడికుడుతనాచారి

కలశాబ్ధికూ(తురట గంభీరాల కేమరుదు
తల(ప లోకమాతయట దయ మరి మేమరుదు
జలజనివాసియట చల్ల(దన మేమరుదు
కొల(దిమీర యీ చూడికుడుతనాచారి

అమరవందితయట అట్టె మహిమేమరుదు
అమృతము చుట్టమట ఆనందాల కేమరుదు
తమితో శ్రీ వేంకటేశు( దానె వచ్చి పెండ్లాడె
కొమెరవయసు చూడికుడుతనాచారి

అన్నమయ్య సంపుటం 26 సంకీర్తన 246
[12/9, 07:48] Venkatesh K E: Venkatesh K E:

హరుడివై త్రిశూలం బూని
హరివై చేత చక్రంబు బూని
హరి హరులు ఒక్కటేనని
మము రక్షింపగ వచ్చితిరని
నమ్మితిని నిజమని నమ్మితిని

నీల కంఠుడివై హాలాహలం మింగి
మోహినివై అమృతం కాపాడి
హరి హరులు ఒక్కటేనని
మము కాపాడగ వచ్చితిరని
నమ్మితిని నిజమని నమ్మితిని

శివుడివై డమరుకం ఆడించి
కృష్ణుడివై పిల్లనగ్రోవి వాయించి
హరి హరులు ఒక్కటేనని
మము ఆశీర్వదించగ వచ్చితిరని
నమ్మితిని నిజమని నమ్మితిని

Happy Saturday n weekend.
09-12-2017
[12/16, 07:43] Venkatesh K E: ఓ శ్రీనివాసా

నా లోని జ్ఞానము నీవే నాలో ఉన్న విజ్ఞానము నీవే

నా లోని భయము నీవే పారద్రోలే అభయము నీవే
Happy Saturday n weekend
[12/16, 07:43] Venkatesh K E:
 గది అంటే

తరగని నీతి
తరగని నిధి
తరగని జ్గానగని
తరగని విద్యాసిరి

బడి అంటే

అమ్మ ఒడి
చదువుల గుడి
నేర్పించే ఒరవడి
మంచి నడవడి

గురువు అంటే

చేసే లెక్కలు సులువు
ఉండదు మర్యాదకు కరువు
పెట్టే శాస్త్రాలు ఏకరువు
చదువుల నెలవు
         వేం*కుభే*రాణి
ప్రపంచ తెలుగు మహాసభలు
[12/22, 07:25] Venkatesh K E:
 దేవి

సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కద సింగారాలకేమి తక్కువా
కాముని తల్లి కద చక్కదనాలు ఏమీ తక్కువా
చంద్రుని తోబుట్టువు కద సొంపైన కళలు ఏమీ తక్కువా
క్షీరాబ్ధి కన్నియ కద గంభీరాలకేమి తక్కువా
లోక మాత కద దయకు ఏమీ తక్కువా
పద్మము లో ఉండును కద చల్లదనాలకు ఏమీ తక్కువా
దేవ కాంతవు కద మహా మహిమలకు ఏమీ తక్కువా
అమృతమునకు చుట్టము కద ఆనందాలకేమి తక్కువా
వెదికి, స్వయంగా వచ్చి పెండ్లాడిన వేంకటేశుడికి ఏమీ తక్కువా

ఈ శుక్రవారం మీకు మీ కుటుంబానికి శుభము కలుగాలని ఆకాంక్షిస్తూ
[12/23, 07:43] Venkatesh K E:
 శ్రీనివాసా

నాకు హరివి నీవే హరుడు నీవే స్వామి!
వైకుంఠము కైలాసము నీవే కదా స్వామి!

నా ఆట నీవే నా పాట నీవే స్వామి!
నీ మాటే నా బాట కదా స్వామి!

మంచు నీవే జ్వాలవు నీవే స్వామి!
నీ అందమే నా ఆనందం కదా స్వామి!

నా నిధి నీవే నా విధి నీవే స్వామి!
నీ బంధువులే నా బళగము కదా స్వామి!

నా పాపము మాయ చేయు పుణ్యము నీవే స్వామి!
నా కర్త కర్మ క్రియ నీవే కదా స్వామి!

ఇలలో నీవే నా కలలో నీవే స్వామి!
నా మనసులో మెదిలే ఆలోచనలు నీవే కదా స్వామి!

నా కర్మము నీవే నా ధర్మము నీవే స్వామి!
సూక్ష్మము లో ప్రసాదించే మర్శము నీవే కదా స్వామి!

Happy Saturday n weekend.

No comments:

Post a Comment