శ్రీ రామ చంద్రయ్య
తండ్రి దశరథుడి మీది ప్రేమలో కాసింతైనా మా మీద ప్రేమ కురుపించవయ్యా!
సీతమ్మ వారి మీది శ్రద్ధ లో కాసింతైనా మా మీద శ్రద్ధ వహించవయ్యా!
హనుమంతుని మీది వాత్సల్యంలో ఉడుతంతైనా మా మీద కురుపించవయ్యా !
రావణాసురిడి మీది కోపం లో కాసింతైనా మము దండించవయ్యా !
శ్రీ రామ దాసు లా గుడి కట్టలేను! శబరి లా వేచి యుండ లేను !
లక్ష్మణుడిలా సేవ చెయ్యలేను! హనుమంతుడిలా జపించలేను !
నీకు నేనేమి ఇవ్వగలను రామా! కోందండ రామా !
అందరికి దీపావళి శుభాకాంక్షలు !!
* - * - * * - * - * * - * - * * - * - *

ఓం! రామాయ శ్రీ వేంకటేశాయ నమః
రామ రాజ్యం సృష్టించిన రాముడు భువి పైనున్న కోట్లాది మానవులలో ఒక్కడా స్వామి!
చిన్నప్పుడే మారీచ సుబాహు రాక్షసులను మట్టు బెట్టిన చిట్టి రాముడు మానవుడా స్వామి!
శివ ధనస్సు విరిచి లోక మాత సీతను పరిణయ మాడిన రాముడు కూడా నరుడా స్వామి!
తండ్రి ఇచ్చిన మాట కోసం రాజవాసం వదిలి అరణ్య వాసానికి వెళ్లిన రాముడు సామాన్యుడా స్వామి!
గౌతమ మహర్షి ఇల్లాలు అహల్యకు శాప విమోచన చేసిన రాముడు రాయి మానవుడు ఒక్కటేనా స్వామి!
సప్త వృక్షాలు ఒక బాణంతో కూల్చి, కేవలం వానర సైన్యంతో సముద్రాన్ని దాటి దండెత్తిన రాముడు వా మనుడు కాదా స్వామి!
అష్ట దిక్పాలకులు, నవ గ్రహాలను పాదా క్రాంతం చేసుకున్న రావణుని ఓడించిన రాముడు మాధవుడు కాదా స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
Sree Rama Navami Wishes to All.
* - * - * * - * - * * - * - * * - * - *
ఓ! రామ!
తిని రుచి చూచి తీపి పళ్లను తినిపించడానికి నేనేమి శబరిని కాను!
పద్యాల రుచిని అడగడానికి రామదాసు అయిన కంచర్ల గోపన్నను కాను!
గొంతెత్తి రెండు వాక్యాలను పాడడానికి సంత్ కబీర్ ను కాను!
గొంతెమ్మ కోరికలను కోరడానికి నేనేమి నీ తల్లి కైకేయి ని కాను!
కాళ్లు కడిగి తన నావను పిల్లనవ్వడానికి ఎద హత్తుకొన గుహుడిని కాను!
కాళ్లు కడిగి తన జానకిని లోక కళ్యాణార్ధాం ఇవ్వడానికి జనుకుడు కాను!
నీ క్షేమం కోసం ఒళ్లంతా సిందూరం పూసుకోడానికి ఆంజనేయుడు కాను!
మైత్రి బంధం కోసం యుద్ధములో తోడు నిలిచిన సుగ్రీవుడు ని కాను!
మాయ చేసి లక్ష్మణా అని అరవడానికి పైడి హరిణి మారీచుడిని కాను!
రెక్కలు తెగినా మాత కోసం తెగించి పోరాడడానికి జటాయువును కాను!
లక్ష్మణుడుని బ్రతికించడానికి లంకా వైద్యులు సుషేణుడు కాను!
రాళ్లు మోసికొని వచ్చి వంతెన నిర్మాణం చేసిన కోతి పిల్లను కాను!
రాళ్ల సందులలో ఇసుకను పోసి వంతెనను పటిష్ఠ పరిచిన చిట్టి ఉడుతను కాను!
మదిలో పెట్టు కొని పూజించడానికి మంత్రాలయ రాఘవేంద్రుడు కాను!
వేం*కుభే*రాణి
Happy Saturday and Weekend.
[12/4/2019, 9:53 PM] venky HYD:
* - * - * * - * - * * - * - * * - * - *
ఓం! రామాయ శ్రీ వేంకటేశాయ నమః
రామ రాజ్యం సృష్టించిన రాముడు భువి పైనున్న కోట్లాది మానవులలో ఒక్కడా స్వామి!
చిన్నప్పుడే మారీచ సుబాహు రాక్షసులను మట్టు బెట్టిన చిట్టి రాముడు మానవుడా స్వామి!
శివ ధనస్సు విరిచి లోక మాత సీతను పరిణయ మాడిన రాముడు కూడా నరుడా స్వామి!
తండ్రి ఇచ్చిన మాట కోసం రాజవాసం వదిలి అరణ్య వాసానికి వెళ్లిన రాముడు సామాన్యుడా స్వామి!
గౌతమ మహర్షి ఇల్లాలు అహల్యకు శాప విమోచన చేసిన రాముడు రాయి మానవుడు ఒక్కటేనా స్వామి!
సప్త వృక్షాలు ఒక బాణంతో కూల్చి, కేవలం వానర సైన్యంతో సముద్రాన్ని దాటి దండెత్తిన రాముడు వా మనుడు కాదా స్వామి!
అష్ట దిక్పాలకులు, నవ గ్రహాలను పాదా క్రాంతం చేసుకున్న రావణుని ఓడించిన రాముడు మాధవుడు కాదా స్వామి!
వేం*కుభే*రాణి
Happy Saturday n weekend.
Sree Rama Navami Wishes to All.
* - * - * * - * - * * - * - * * - * - *
[13/4/2019, 11:08 AM] venky HYD:
అదిగో భద్రగిరి భద్రాద్రి; అల్లదిగో తిరుమల గిరి వేంకటాద్రి!
తండ్రి మాటకు రాజ్యం వదిలిన రాముడు; జనుల బాసటకు వైకుంఠం విడిచిన రమణుడు!
ఒకటే బాణం ఒకటే మాట రఘు నాధుడు; ఒకే ప్రాణం ఒకటే కళ్యాణం వేంకటేషుడు!
రాక్షసులను సంహరించిన జానకి రాముడు; మన లోని రాక్షసుడిని సంహరించిన వేంకటేశ్వరుడు!
ఛ కాలి నోటి మాటకు సీతను వదిలిన రాముడు; భృగు పాద ధూళికి పద్మావతి విడిచిన గోవిందుడు!
మానవునిగా పుట్టి మాధవుడైన రాముడు; మానవుల కోసం భూలోకం వచ్చిన రమణుడు!
కంచర్ల గోపన్న స్వామి రాముడు: అన్నమయ్య తాళమే శ్రీనివాసుడు!
వేం*కుభే*రాణి
అందరికి శ్రీ సీతారాముల కల్యాణ శుభాశీస్సులు!
* - * - * * - * - * * - * - * * - * - *
ఒక్కటే బాణం ఒంటిమిట్ట రామం
ఏక పత్ని స్ధానం ఏకశిలా నగర సీతం
పోతన భాగవత బమ్మెరం ఆంధ్రా భద్రా చలం
విజయనగర సామ్రాజ్య శిల్పం రామ బాణ తీర్ధం
ఏక శిలా విగ్రహం లక్ష్మణ రామం సీతం
శ్రీ ఆంజనేయ మమేకం లక్ష్మణ సమేత రామం
హనుమ లేని ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం
వేేం*కుభే*రాణి
This temple is built before Hanuma meets Rama. That's the reason Hanuma is not in this temple.
Rama, Sita, Lakshmana all sculpted from one stone, that's the name Ontimitta. Temple architecture is of Vijayanagara samrajya style.
* - * - * * - * - * * - * - * * - * - *
శ్రీ రామ చంద్రయ్య
తండ్రి దశరథుడి మీది ప్రేమలో కాసింతైనా మా మీద ప్రేమ కురుపించరా!
సీతమ్మ వారి మీది శ్రద్ధ లో కాసింతైనా మా మీద కరుణ వీక్షించుమా!
హనుమంతుని మీది భక్తి లో ఉడుతంతైనా మా మీద కరుణ వీక్షించుమా!
రావణాసురిడి మీది కోపం లో కాసింతైనా మా మీద ప్రేమ కురుపించరా!
శ్రీ రామ దాసు లా గుడి కట్టలేను, శబరి లా పండ్లతో వేచి యుండ లేను !
అందరికి దీపావళి శుభాకాంక్షలు !!
* - * - * * - * - * * - * - * * - * - *
భార్యతో విసిగి వేసారిన ఓ భర్త, రాముడితో తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు ఇలా
రాతిని నాతిగా మార్చిన ఓహ్! రామా!
నా నాతిని రాతిగా మార్చవా! రామా!
లేదా, రాతి గుండెనన్నా మార్చావా!
కనీసం, నాటి/తిగానైనా ఉంచవా సీతరామా!
* - * - * * - * - * * - * - * * - * - *
పలుకే బంగారమాయరా ఓ కోదండ పాణి! పలుకే బంగారమాయరా!
నీ అవతరణ, బహు పత్ని వితరణ !
విలువలు సడలని, మాట మారని !
అవతార తత్వమే, ఏకత్వం కావున!
శ్రీ రామ నీవు క్షేమ; లేక నీకూ ఓ భామ!
పలుకే బంగారమాయరా ఓ కోదండ పాణి! పలుకే బంగారమాయరా!
* - * - * * - * - * * - * - * * - * - *
[5/4/2017, 12:01 PM] venky HYD:
బ్రహ్మా సృష్టిలొ దివ్య మైన *జానకిని*
విష్ణు అవతార పురుషుడైన *రాముడు*
మహేశ్వరుడి విల్లు విరిచి కళ్యాణామాడే!
[5/4/2017, 6:45 PM] venky HYD:
రాములొరి పుణ్యమా అని
పానకం చేసేను తియ్యగా ఇలాచి తొ,
చిత్రాన్నం అయ్యే ఘాటుగా మిర్చి తొ,
పెసర కొసంబరి కీరా క్యారెట్టుతొ, ఘుమ
ఘుమ లాడే గుల్ పాపిడి నెయ్యి తొ!
* - * - * * - * - * * - * - * * - * - *
[6/4/2017, 9:58 AM] venky HYD:
వేప ఫూవ్వుతొ గొంతు సవరించిందా
బెల్లం తొడై మాధుర్యం పెంచిందా
మామిడి పిందెకు పాట వచ్చిందా
కోయిల గొంతుకు మావి నచ్చిందా
ఏమో ఏమేమో కాని ఈ వసంత కోకిల గానం చాలా బాగుందే.
అందరికి వసంత ఋతువు చైత్ర మాసా పౌర్ణమి (ಹಂಪಯ್ಯ ಹುಣಿವಿ) శుభాకాంక్షలు.
Also wishes on New Year for Tamils.
* - * - * * - * - * * - * - * * - * - *
శివుని విల్లు నెత్తగలిగిన ఓ రామా
సీతమ్మ జడ పైకెత్తగలవా శ్రీ రామా!
ఆహ పవిత్రమాయే పాదము సొకగానే అహల్య
మరి తనువే తాకిన జానకి కాలేనా హొత్రమై!
చేయి తాకగానే పండేను గొరింటా అరచేత
వైకుంఠమున నుండెడి నిండు గర్భిణిని నట అడవిలొ!
ఇదంతా ధర్మము కొరకేనని అర్థమయ్యేనా ఈ మానవులకు.
వేం*కుభే*రాణి
* - * - * * - * - * * - * - * * - * - *
రాముడు చేసెను ఇసుక లింగం
ఎవరు తాకిన ఇసుక ప్రసాదం
కొంతైన తరగదు రామలింగం
అందరికి ఇస్తున్న ముక్తి ధామం
ఈ ప్రొద్దుటూరు ముక్తి రామలింగేశ్వర ఆలయం.
Happy Saturday n weekend.
* - * - * * - * - * * - * - * * - * - *
[20/3/2018, 9:33 PM] venky HYD:
రాముడితడు! ఈ రమణుడు!
సీతాపతి ఇతడు! పద్మ పతి!
కోదండమే కదా ఈ నందక ఖడ్గం!
లోకాభిరాముడే ఈ తిరుమల వాసుడు!
[20/3/2018, 10:52 PM] venky HYD:
సప్త వృక్షాలు కూల్చిన రాముడే!
సప్త గిరులపై కూర్చున్న రమణుడు!
సముద్రం దాటి దానవులను కడతేర్చిన రాముడే!
సంసారం దాటి మానవులకు మోక్ష మిచ్చిన రమణుడు!
శివుని విల్లు విరిచి సీతను పెండ్లాడిన రాముడే!
వైకుంఠము దిగి పద్మావతిని వరించిన రమణుడు!
రాజ్యం రామరాజ్యం అనేలా ఆ రాముడు!
క్షేత్రం తిరుమల క్షేత్రమే అనేలా ఈ రమణుడు!
స్వర్ణ అశ్వముతో అశ్వమేథ యజ్ఞం ఆ రాముడు!
అశ్వమెక్కి పద్మావతిని కళ్యాణ యజ్ఞం ఈ రమణుడు!
ముత్యాల తలంబ్రాలతో విరసిల్లు ఆ కళ్యాణ రాముడు!
నిత్య కళ్యాణ తలంబ్రాలతో విరసిల్లు ఈ కళ్యాణ రమణుడు!
త్రేతాయుగ ప్రజలకు ఆచరణీయుడు ఆ రాముడు!
కలియుగ భక్తులకు పూజ్యనీయుడు ఈ రమణుడు!
శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో.
* - * - * * - * - * * - * - * * - * - *
[25/3/2018, 2:13 PM] venky HYD:
నరుడంటే కించిత్ యైన లెక్క లేదు రావణుడికి!
నరులలో మహానీయుడైన రాముడి చిక్కు తప్ప లేదు రావణుడికి!
మానవులు నన్నేమి చేయగలరు అనుకున్నాడు రావణుడు!
మానవులు మిన్నంటే చితి పేరుస్తారు ప్రతి రామ నవమి నాడు!
అమృతం తాగిన దేవతలే రావణుడిని ముట్టడి చేయలేక!
అమృత భాండం బద్దలు కొట్టి రావణుడికి ముక్తి నిచ్చి మాధవుడైనాడు రాముడు!
వేం*కుభే*రాణి
అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!
* - * - * * - * - * * - * - * * - * - *
[25/3/2018, 10:24 PM] venky HYD:
అడక్కుండానే ఇచ్చారు సీత కోసం బంగారాన్ని ఆ రామ రాజ్య ప్రజలు!
అడగంగానే ఇచ్చారు సీతా రామ భద్రుడికి బంగారాన్ని శ్రీ రామ దాసు ప్రజలు!
కలలోనే తానీషాకు కాలం కాని బంగారు వరహాలు ఇచ్చారు రామోజి లక్ష్మోజిలు!
అడిగినా ఇవ్వగలరా, ఇస్తారా ఈనాటి ప్రజలు శ్రీ రామ కళ్యాణానికి!
వేం*కుభే*రాణి
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
* - * - * * - * - * * - * - * * - * - *
పూజ్యాయా రాఘవేంద్రాయా!
సత్య ధర్మ వ్రతాయచ!
భజతాం కల్ప వృక్షాయ!
నమతాం కామ ధేనువే!
మంత్రాలయ శ్రీ రాఘవేంద్రాయా!
మంచాలమ్మ ప్రధమ దర్శనాయా!
తుంగభద్ర తీర బృందావనే!
సత్యం ధర్మం రామంభజే!
26-10-2017
* - * - * * - * - * * - * - * * - * - *
అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!
రామ చంద్ర నవమి!
జానకి తల్లి పుడమి!
సీతా రాముల కలిమి!
సుగ్రీవ రాముల చెలిమి!
హనుమ అంగద బలిమి!
* - * - * * - * - * * - * - * * - * - *
రాముని బాణము నైనను భక్తితో ఆపవచ్చునేమో!
ఏటి వరదకు నైనను ఎదురెళ్లి ఈదవచ్చునేమో!
బట్ట తలయందైనను జుట్టు మోలపించ వచ్చునేమో!
కానీ ఆడుదాని ఆలోచనకు అడ్డు కట్ట వేయలేము!
From a very old cinema.
* - * - * * - * - * * - * - * * - * - *
[28/5/2019, 8:41 PM] venky HYD:
లక్ష్య సాధనకు హనుమంతుని కార్య దక్షత మార్గదర్శకం!
మైనాకుడి ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి ఆంజనేయుడు కార్యసాధనలో విషయ వాంఛలపై దృష్టి మరల్చరాదని చెప్పెను!
మింగబోయిన సురస రక్కసిని సూక్ష్మ రూపుడై నోటిలో దూరి బయటకు వచ్చిన వైనం సమయ స్పూర్తికి నిదర్శనం!
లంకా ప్రవేశాన్ని అడ్డుకున్న లంకిణిని సమయానుకూలంగా వ్యవహరించి ప్రతికూలతలను కూడా అనుకూలతగా మార్చుకోవడం విజేతల దక్షతకు నిదర్శనం!
అశోక వనంలో సీతను వెదకడంలో తన బుద్ధి చతురతలను చూపడం ఆంజనేయుని నిశ్చల చిత్తశుద్ధికి నిదర్శనం!
రావణ సభలో తన బలాన్ని చూపి రామ బలాన్ని చెప్పి రావణ దురాగతాలను బహిర్గతం చేసి, అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం నిదర్శనం!
లంకా దహనం చేసి, లంకేయుల దృష్టి మరల్చడం యుద్ద నీతి కుశలతకు నిదర్శనం!
సీత నుదుట సింధూరం చూసి రాముని క్షేమార్థం ఒళ్లంతా సింధూరం పూసుకోడం రామ భక్తికి నిదర్శనం!
అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
* - * - * * - * - * * - * - * * - * - *
[31/5/2019, 5:41 PM] venky HYD:
ఓ! రామ!
తిని రుచి చూచి తీపి పళ్లను తినిపించడానికి నేనేమి శబరిని కాను!
పద్యాల రుచిని అడగడానికి రామదాసు అయిన కంచర్ల గోపన్నను కాను!
గొంతెత్తి రెండు వాక్యాలను పాడడానికి సంత్ కబీర్ ను కాను!
గొంతెమ్మ కోరికలను కోరడానికి నేనేమి నీ తల్లి కైకేయి ని కాను!
కాళ్లు కడిగి తన నావను పిల్లనవ్వడానికి ఎద హత్తుకొన గుహుడిని కాను!
కాళ్లు కడిగి తన జానకిని లోక కళ్యాణార్ధాం ఇవ్వడానికి జనుకుడు కాను!
నీ క్షేమమం కోసం ఒళ్లంతా సిందూరం పూసుకోడానికి ఆంజనేయుడు కాను!
మైత్రి బంధం కోసం యుద్ధములో తోడు నిలిచిన సుగ్రీవుడు ని కాను!
మాయ చేసి రామా రామా అని అరవడానికి పైడి హరిణి మారీచుడిని కాను!
రెక్కలు తెగినా మాత కోసం తెగించి పోరాడడానికి జటాయువును కాను!
లక్ష్మణుడుని బ్రతికించడానికి లంకా వైద్యులు సుషేణుడు కాను!
రాళ్లు మోసికొని వచ్చి వంతెన నిర్మాణం చేసిన కోతి పిల్లను కాను!
రాళ్ల సందులలో ఇసుకను పోసి వంతెనను పటిష్ఠ పరిచిన చిట్టి ఉడుతను కాను!
మదిలో పెట్టు కొని పూజించడానికి మంత్రాలయ రాఘవేంద్రుడు కాను!
* - * - * * - * - * * - * - * * - * - *
No comments:
Post a Comment