Tuesday శ్రీ వాసవాంబ స్తొత్రమ్
శ్లో ।। కైలసాచలసన్నిభే గిరిపురే సౌవర్ణశృంగే మహా
స్తంభోద్యన్ మణిమంటపే సురతరుప్రాంతే చ సింహసనే ।
ఆసీనాం సకలామరార్చితపదాం భక్తార్తివిధ్వంసినీం
వందే వాసవకన్యకాం స్మితముఖీం సర్వార్థదామంబికామ్ ।
నమస్తే వాసవీదేవి నమస్తే విశ్వపావని
నమస్తే వ్రతసంబద్దే కౌమాత్రే తే నమో నమః
నమస్తే భయసంహరి నమస్తే భవనాశిని
నమస్తే భాగ్యదాదేవి వాసవి తే నమో నమః
నమస్తే అద్భుతసంధానే నమస్తే భద్రరూపిణి
నమస్తే పద్మపత్రాక్షి సుందరాంగి నమో నమః
నమస్తే విబుధానందా నమస్తే భక్తరంజని
నమస్తే యోగసంయుక్తే వణిక్కన్యే నమో నమః
నమస్తే బుధసంసేవ్యే నమస్తే మంగళప్రదే
నమస్తే శీతలాపాంగి శంకరి తే నమో నమః
నమస్తే తే జగన్మాత నమస్తే కామదాయిని
నమస్తే భక్తనిలయే వరదే తే నమో నమః
నమస్తే సిద్దసంసేవ్యే నమస్తే చారుహాసిని
నమస్తే అద్భుతకల్యాణి శర్వాణి తే నమో నమః:
నమస్తే భక్తసంరక్షే దీక్షా సంబద్ధకంకణే
నమస్తే సర్వకామ్యార్థ వరదే తే నమో నమః
దేవీం ప్రణమ్య సద్భక్త్యా సర్వకామార్థసంపదాన్
లభతే నాత్ర సందేహో దేహంతే ముక్తి మాన్ భవేత్
* శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దండకం*
శ్రీ మన్మహాదేవి దాక్షాయణి లోకకల్యాణ సంధాయనీ భక్త లోకైక రక్షామణీ దేవి, భూలోకధారంబు దీర్పంగ నాంధ్రావనిన్ ఆంధ్రరాష్ట్రంబునన్ పూతగోదావరి మండలంబందు సింగార ముంగారు బంగారు రంగారు నత్యున్నతోత్తంగమౌరమ్య హర్మ్యాళితో, రత్నమాణిక్య నీరాజతంబైన ప్రాకారముల్ గల్గియున్ శ్రీ పార్వతీదేవితో గూడి కైలాసవాసుండవౌ శ్రీ పురీశుండు నిత్యంబుగానుండ శ్రీలక్ష్మీ నారాయణుండన్ సదా నిల్చి యుండంగ నొప్పారుచున్ వేదవేదాంగ పారాయణుల్ బాడబుల్ రత్నమాణిక్య వాణిజ్యపారీణులౌ వైశ్య రత్నాలు స్వర్ణంబు బండింపగాజాలు బల్ కర్షకానీక సందీప్తమైమొప్పుచున్ నూరులింగంబులన్ నూరుకోనేరులన్ నూరుపేన్ బావులన్ నూరు పూదోటలన్ గల్గి మున్ పూర్వచారిత్రమందెన్న సత్కీర్తులన్ గన్న పెన్గొండ పట్నంబునన్ వైశ్యరత్నంబవై బుట్టియున్ వాసవీ బాలనామంబుతో శుక్లపక్షంపు చంద్రుడు నావృద్ధి బొందందా దేదీప్యమానంబుగా వెల్గు నీ దివ్యరూపంబు వీక్షించి విష్ణ్వర్ధ్ననామాంకితుడైన రాజేంద్రుడొక్కడు మోహించి పెండ్లాడ నూహించి యత్నంబు గావింపగా వైశ్యలోకంబు యోచించి యోచించి వర్ణాంతరంబైన వైవాహికంబెన్న దూష్యంబటంచెంచి నిన్నీయగీ నొల్లమంచన్న నారాజుక్షాత్రంబు జూపించి దండించగా పెంచనప్పట్టునన్ నీవు వర్ణింపు ధర్మాల కాపాడగా బూని యెన్నెన్నియో యార్యదర్మంబులన్ దెల్పి యా మీదటన్నీవు వంశమ్ముకొక్కరన్ నిల్పి యా బాలవృద్దాదులన్ గూడి, కైలాసనాధాలయ ప్రాంగణంబందు చండాగ్నిగుండంబులం జొచ్చి, స్వర్ణంపు రూపంబుతో మద్భవంబందియు న్నీవు వైశ్యాళికిన్ నీదు భక్తాళికిన్ బ్రీతి కళ్యాణముల్ కూర్చి కాపాడవో దివ్యకళ్యాణి రుద్రాణి మీనాక్షి మహేశ్వరి మాత నిత్యంబు నీ దివ్య పాదారవిందంబు లత్యంత మోదంబుతో గొల్తునన్నేలుమో తల్లీ! యానందసంధాయిని సర్వ సౌభాగ్యముల్ సర్వసౌఖ్యంబులన్ మంచి సంతానమున్ ఆయురారోగ్యముల్ గూర్చి యెల్లప్పుడున్ బ్రోవు కాత్యాయని, రాజేశ్వరి, దుర్గ, సర్వేశ్వరీ, శాంకరీ, వాసవీబాల జాలంబుసేయంగ నీకేల వేవేగ రావమ్మ! మా నేరముల్ సైచి మన్నించి నీ దివ్య కారుణ్యమున్ జూపు నీకూర్మి భక్తాళిలో జేర్చి నన్నోముమో యంబ చిత్తంబు నన్యత్ర సంచారమున్ సేయకెల్లప్డు నిన్నే ధ్యానమ్ము సేయంగ నన్నోముమో యార్త రక్షాకరీ, కాళీ నీకన్న నా కెవ్వరున్, బ్రాపులేరంచు పల్మారు బ్రార్ధింతు రక్షింపు రక్షింపు రక్షింపు మాంబ నమస్తే నమస్తే నమస్తే.... నమః

No comments:
Post a Comment